తెలుగు రాష్ట్రాలలోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఉండనుంది. అలాగే శనివారం కూడా కొన్ని స్కూళ్లకు హాలిడే ఇవ్వనుండగా.. సండే ఎలాగూ సెలవు ఉంటుంది. అలాగే ఐటీ కంపెనీలకు శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. దీంతో వరసుగా మూడు రోజులు సెలవులు వస్తుండటంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లు, హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.