ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇకపై చౌకదుకాణాల్లో బియ్యానికి బదులుగా ప్రతి కార్డుకు మూడు కిలోల రాగులు ఉచితంగా ఇస్తారు. పోషకాహారం పెంచే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ కోటా నుంచి అమల్లోకి రానుంది. మూడు కిలోల రాగులకు గానూ మూడు కిలోల బియ్యం తగ్గిస్తారు. ఇప్పటికే రేషన్ డిపోలకు రాగుల సరఫరా పూర్తయింది. నేటి నుంచే పంపిణీ ప్రారంభమవుతోంది. ప్రజారోగ్యం దృష్ట్యా రాగుల పంపిణీ కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధులకు మాత్రం ఇంటికే డోర్‌డెలివరీ చేస్తోంది.