త్వరలోనే 30 వేల ఉద్యోగాలు: నారా లోకేష్

25చూసినవారు
త్వరలోనే 30 వేల ఉద్యోగాలు: నారా లోకేష్
AP: విశాఖపట్నం కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. త్వరలోనే విశాఖకు టీసీఎస్ సహా పలు అంతర్జాతీయ కంపెనీలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. గూగుల్ సెంటర్‌ ఏర్పాటుకు కృషి పూర్తైందని, ఈ నెలాఖరులోనే శంకుస్థాపన ఉంటుందని తేల్చి చెప్పారు. రూ.3,800 కోట్ల పెట్టుబడుల ద్వారా రానున్న 3 ఏళ్లలో 30 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ త్వరలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్