పులివెందులలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 300 మంది కుటుంబాలు

50చూసినవారు
పులివెందులలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 300 మంది కుటుంబాలు
AP: కడప జిల్లాలోని పులివెందులలో మాజీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జండామాన్ వీధికి చెందిన ముస్లిం సోదరులతో పాటు సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ నేత బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, చంద్రబాబు నాయుడి విధానాలు చూసే తాము పార్టీ మారినట్లు వారు తెలిపారు. ఈ చేరికలతో పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్