AP: మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తొందర్లోనే అమలు కానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. శనివారం కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహిళా నాయకత్వం రావాలి. మగవారితో సమానంగా ముందుకెళ్లాలి. వారికి ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పిస్తే నేను కాలేజీల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాను. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొందర్లోనే అది జరుగుతుంది. మహిళలు పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు’ అని పేర్కొన్నారు.