ఇళ్లల్లో చిరాకు తెప్పించే బొద్దింకల మూలాలు 35 కోట్ల సంవత్సరాల క్రితం నాటి కార్బోనిఫెరస్ కాలంతో ముడిపడి ఉన్నాయని శిలాజ ఆధారాలు సూచిస్తున్నాయి. డైనోసార్ల కంటే ముందే ఉనికిలో ఉన్న ఈ జీవులు, కోట్లాది సంవత్సరాల వాతావరణ మార్పులను తట్టుకొని, తమ భౌతిక నిర్మాణంలో పెద్దగా మార్పు లేకుండా మనుగడ సాగించాయి. గ్యాంగ్లియన్లు శరీరం అంతటా విస్తరించి ఉండటం, నిశాచర జీవనం, వ్యర్థ ఆహారాన్ని తినడం, అధిక రేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం వంటివి వాటి అద్భుతమైన మనుగడకు కారణాలని నిపుణులు తెలిపారు.