40 ఏళ్ల నాటి ఎముక.. అంటార్కిటికా తొలి డైనోసార్ శిలాజం గుర్తింపు!

10352చూసినవారు
40 ఏళ్ల నాటి ఎముక.. అంటార్కిటికా తొలి డైనోసార్ శిలాజం గుర్తింపు!
ప్రస్తుతం మంచు ఖండంగా ఉన్న అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు మొట్టమొదటి డైనోసార్ శిలాజాన్ని గుర్తించారు. 1985 డిసెంబర్‌లో డాక్టర్ మైక్ థామ్సన్ జేమ్స్ రాస్ ఐలాండ్‌లో కనుగొన్న ఒక ఎముకను, 40 ఏళ్ల తర్వాత ఆధునిక సాంకేతికతతో పరిశీలించగా అది టైటానోసార్‌కు చెందిన తోక ఎముక అని తేలింది. సుమారు 82 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఈ శిలాజం, అప్పట్లో అంటార్కిటికా దట్టమైన అడవులతో ఉండి, ఖండాల మధ్య డైనోసార్ల వలసకు ల్యాండ్ బ్రిడ్జ్‌గా ఉపయోగపడిందనే సిద్ధాంతానికి బలమైన ఆధారం ఇచ్చింది.

సంబంధిత పోస్ట్