బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు.. దరఖాస్తుకు FEB19 వరకు గడువు

9250చూసినవారు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు.. దరఖాస్తుకు FEB19 వరకు గడువు
బ్యాంక్ ఆఫ్ బరోడా 418 ఐటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 22 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి, రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం bankofbaroda.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.