AP: ఏపీ పంచాయతీ రాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు లభించాయి. డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పంచాయతీల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలకు ఈ గుర్తింపు దక్కింది. బుధవారం ఢిల్లీలోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు దక్కగా, వాటిలో 5 ఏపీ నుంచి ఎంపికయ్యాయి.