AP: ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం సీఎం చంద్రబాబు 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మట్టిలో పుట్టిన మాణిక్యాలను సానబెట్టే బాధ్యతను నేను తీసుకుంటాను. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయి. బ్రహ్మం గారు చెప్పినట్లు కనిగిరి త్వరలోనే కనకపట్నం అవుతుంది’ అని అన్నారు.