దక్షిణాఫ్రికాలో భారత వాహనాలకు 50% సుంకం?

8367చూసినవారు
దక్షిణాఫ్రికాలో భారత వాహనాలకు 50% సుంకం?
ప్రపంచ వాణిజ్యంలో భారత్‌కు మరో సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారతదేశం, చైనా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై 50 శాతం సుంకం విధించే అంశాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌, చైనా నుంచి భారీగా వాహనాల దిగుమతులు జరుగుతుండటంతో స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని దక్షిణాఫ్రికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2024 గణాంకాల ప్రకారం, దక్షిణాఫ్రికాకు వాహనాలను సరఫరా చేసే అతిపెద్ద దేశాలుగా భారత్‌, చైనా నిలిచాయి. మొత్తం వాహన దిగుమతుల్లో భారత్ వాటా 53 శాతం కాగా, చైనా వాటా 22 శాతంగా ఉంది. ఈ ప్రతిపాదన ఇంకా సమీక్ష దశలోనే ఉన్నప్పటికీ, అమలులోకి వస్తే భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్