విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో 50 విద్యుత్ బస్సులను నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 11 వేల బస్సులు నడుపుతున్నామని, ప్రమాదాలు కలవరపెడుతున్నాయని, కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు.