వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం: చంద్రబాబు

21చూసినవారు
వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం: చంద్రబాబు
AP: రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్