2 రోజుల్లో రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా

14517చూసినవారు
2 రోజుల్లో రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా
AP: రాష్ట్రానికి మరో 50 వేల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వివిధ సంస్థల ద్వారా రెండు రోజుల్లో యూరియా చేరుతుందని చెప్పారు. ఆగస్టు నెలకు కేటాయించిన 82,151 టన్నులకు అదనంగా 50 వేల టన్నులు కేటాయించిందన్నారు. ఇప్పటికే రైతు కేంద్రాల ద్వారా 41,183 టన్నులు సరఫరా చేశామని, మరో 40,968 టన్నులు రవాణాలో ఉందన్నారు. తక్షణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే యూరియా వాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్