AP: బీఈడ్ క్వాలిఫికేషన్‌తో ఎస్జీటీగా నియమితులైన అభ్యర్థులు 6 నెలల బ్రిడ్జ్ కోర్స్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టీకరణ అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2018–2023 మధ్య కాలంలో ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు ఈ నెల 25లోపు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.