రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

20593చూసినవారు
రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్‌కు 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-IIIకు 6,234 పోస్టులు ఉన్నాయి. జూన్ 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది. గ్రేడ్-I పోస్టులకు నెలకు రూ.29,200, గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనంతో పాటు ప్రభుత్వ భత్యాలు అందుతాయి.

సంబంధిత పోస్ట్