ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని పలు జిల్లాల సబ్-స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ నియామకాలలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా నకిలీ ధృవపత్రాలతో 69 మంది ఉద్యోగాలు పొందినట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. కడపలో అత్యధికంగా 38 మంది, కర్నూలులో 16 మంది, చిత్తూరులో 4, నెల్లూరులో 4, తిరుపతిలో 3, అనంతపురంలో 3, అన్నమయ్యలో 1 చొప్పున గుర్తించారు. నకిలీ ధృవపత్రాలు సమర్పించిన వారిని తక్షణమే తొలగించాలని, సంబంధిత ఏజెన్సీలకు, సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు.