బంగారం కొనుగోలు, తాకట్టు బంగారం విడిపించడంలో పేరొందిన వాల్యూ గోల్డ్ సంస్థ ఏపీలో విస్తరిస్తోంది. తాజాగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో 7 కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌లు అభిషేక్ చందా, అఖిల్ చందా మాట్లాడుతూ ఈ విస్తరణ తమ సంస్థ అభివృద్ధికి మరో మైలురాయి అన్నారు. బంగారం కొనుగోలులో పారదర్శకతతో కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం 19 బ్రాంచిలు ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో కొత్తగా 50 వరకు బ్రాంచిలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి వాల్యూ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ అనసూయ భరద్వాజ్, సంస్థ సీఈవో భరద్వాజ్ పంపట్వార్, డైరెక్టర్లు హాజరయ్యారు.