ఏకంగా 8 రోజులు సెలవులు!

AP: ఈ ఏడాది చివరి నెల డిసెంబరులో విద్యార్థులు, తల్లిదండ్రులు క్రిస్మస్ సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారికంగా డిసెంబరు 25న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. అయితే, రాష్ట్రంలోని క్రైస్తవ మైనారిటీ విద్యా సంస్థలలో మాత్రం డిసెంబరు 21 నుండి 28 వరకు దాదాపు 8 రోజుల పాటు సెలవులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సెలవుల పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
