8వ వేతన సంఘం: కనీస వేతనం రూ. 55,000కు పెంపు డిమాండ్

14883చూసినవారు
8వ వేతన సంఘం: కనీస వేతనం రూ. 55,000కు పెంపు డిమాండ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8వ వేతన సంఘం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రూ. 18,000 కనీస వేతనం నేటి జీవన వ్యయానికి సరిపోదని, దీనిని రూ. 55,000 నుండి రూ. 69,000 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2016లో 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కనీస వేతనం రూ. 18,000గా నిర్ణయించారు. అయితే, గత పదేళ్లలో నిత్యావసరాలు, వైద్యం, విద్య, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. 8వ వేతన సంఘం నేటి కాలానికి తగ్గట్టుగా గౌరవప్రదమైన కనీస వేతనాన్ని పునర్నిర్వచించాలని కోరుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్