90% భారతీయులకు పళ్ల సమస్యలు

5914చూసినవారు
90% భారతీయులకు పళ్ల సమస్యలు
భారతీయుల్లో 90% మంది ఏదో ఒక సమయంలో చిగుళ్లు, దంత వ్యాధులతో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ, పంటి నొప్పి భరించలేనంతగా ఉంటే తప్ప చాలా మంది దంతవైద్యులను సంప్రదించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. చికిత్స భయం, నొప్పి లేకపోతే సమస్య లేదనుకోవడం, నిర్లక్ష్యం వంటివి దీనికి కారణాలంటున్నారు. చిన్న సమస్యలను ముందే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో నయం చేయవచ్చని, లేదంటే రూట్ కెనాల్ వంటి ఖరీదైన చికిత్సలు అవసరమవుతాయని, ఇన్ఫెక్షన్లు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్