క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. ఏటా రూ. 2 లక్షల నష్టం!

9833చూసినవారు
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. ఏటా రూ. 2 లక్షల నష్టం!
దేశంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరుగుతున్నా, 92% మంది సరైన కార్డును ఎంచుకోలేక రివార్డులను కోల్పోతున్నారు. '1 ఫైనాన్స్ మ్యాగజైన్' సర్వే ప్రకారం, తప్పుడు కార్డు వాడకం వల్ల ఏటా రూ. 2 లక్షల వరకు నష్టపోతున్నారని తేలింది. ట్రావెల్, డైనింగ్, గ్రోసరీస్ వంటి వాటికి ప్రత్యేక రివార్డులున్నా, చాలామంది ఒకే కార్డును వాడుతున్నారు. సరైన కార్డు ఎంచుకుంటే వార్షిక పొదుపు 10-14% పెంచుకోవచ్చు. ఖర్చుల ఆధారంగా నష్టం రూ. 4 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఉంటోంది. రివార్డ్ పాయింట్లను తెలివిగా వాడితే వేలల్లో ఆదా చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్