ఏపీ SIRలో 99.96% నోటీసుల విచారణ పూర్తి.. 1,665 పెండింగ్‌

15చూసినవారు
ఏపీ SIRలో 99.96% నోటీసుల విచారణ పూర్తి.. 1,665 పెండింగ్‌
ఏపీలో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో 44.28 లక్షల నోటీసులకు గాను 44.27 లక్షల నోటీసులపై విచారణ పూర్తయిందని సీఈవో కార్యాలయం తెలిపింది. 99.96 శాతం విచారణ పూర్తవగా.. 1,665 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో తిరుపతిలో 1,554, ప్రకాశంలో 48, అనంతపురంలో 43, ఎన్టీఆర్‌లో 11, కృష్ణాలో 8, గుంటూరులో ఒకటి ఉన్నాయి. 3.71 కోట్ల మంది ఎలక్టర్లలో 3.70 కోట్ల ఫొటోలను బీఎల్‌వోలు ఆమోదించారు. ఫారం-6 దరఖాస్తులు 69,184, ఫారం-6A 813, ఫారం-7 8,478, ఫారం-8 31,693 పెండింగ్‌లో ఉన్నట్లు సీఈవో కార్యాలయం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్