చెత్త సినిమానే జీవితాన్ని మార్చింది: రామ్ గోపాల్ వర్మ

13060చూసినవారు
చెత్త సినిమానే జీవితాన్ని మార్చింది: రామ్ గోపాల్ వర్మ
తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా 'అంతం' అని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  పేర్కొన్నారు. జేమ్స్ హాడ్లీ ఛేజ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాను అనుకున్న స్థాయిలో మలచలేకపోయినా, ఇదే తన బాలీవుడ్ ప్రయాణానికి పునాది వేసిందని, నటి ఊర్మిళ మటోండ్కర్ పరిచయమైందని, ఆ తర్వాత 'రంగీలా'తో కెరీర్ మలుపు తిరిగిందని వర్మ తెలిపారు. 'అంతం' ఫ్లాప్ అయినా తన జీవితంలో విలువైన చిత్రమని, ప్రతి అనుభవం మనిషిని తీర్చిదిద్దుతుందని, చేసిన తప్పులు కూడా మేలు చేశాయని, ఎప్పుడూ పశ్చాత్తాపం చెందలేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్