ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్?

60చూసినవారు
ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్?
AP: ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న గ్రామ పంచాయతీల గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అయితే, బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మిశ్రా కమిషన్ నివేదిక రావాల్సి ఉన్నందున, ఈ ఎన్నికలకు బ్రేక్ వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నివేదిక ఏప్రిల్ 20 వరకు రావచ్చు. ఈ పరిణామాలతో సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.