వైసీపీ నేతలపైకి దూసుకెళ్లిన దున్నపోతు.. టీడీపీ సెటైర్లు (వీడియో)

26చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నేతలపై దున్నపోతు దూసుకెళ్లింది. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక ఇంటి నుంచి వైసీపీ నేతలు దున్నపోతుతో ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం వద్ద దున్నపోతు బెదిరిపోవడంతో వైసీపీ నేతలపై దూసుకెళ్లింది. పలువురు నేతలు గాయపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు కాదు.. దున్నపోతుతో రెండు తన్నులు.. దున్న దెబ్బ ఎలా ఉంది’ అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్