జ్ఞానేష్ కుమార్‌పై 'దేశద్రోహం' కింద కేసు పెట్టాలి: వైఎస్ షర్మిల

36చూసినవారు
జ్ఞానేష్ కుమార్‌పై 'దేశద్రోహం' కింద కేసు పెట్టాలి: వైఎస్ షర్మిల
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌పై ‘దేశద్రోహం’ కింద కేసు నమోదు చేయాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఓట్ల అక్రమాలకు తావిస్తూ ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ స్వతంత్రతను కోల్పోయి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన షర్మిల.. ఓటు హక్కును కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్