AP: తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో గత రెండు నెలలుగా భయాందోళన కలిగిస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్క్‌కు తరలించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'X' వేదికగా స్పందిస్తూ.. యూనివర్సిటీలోని విద్యార్థులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.