ప్రముఖ తమిళ నటుడు అరవింద్ ఆకాశ్ (50) తన ప్రియురాలు సారాను వివాహం చేసుకున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దర్శకుడు వెంకట్ ప్రభు, హీరో వైభవ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరి వివాహ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అరవింద్ ఆకాశ్ ‘చెన్నై 600028’, ‘గోవా’, ‘సరోజ’, ‘మంకథ’, ‘మానాడు’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’తో పాటు పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.