AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రేడులో చెల్లెలి పెళ్లి విషయంలో తలెత్తిన వివాదంలో కొడుకు కన్న తండ్రిని గొంతు కోసి హత్య చేశాడు. ఒడిశాల అప్పారావు(49) అనే ఆటో డ్రైవర్ తన చిన్న కుమార్తె పెళ్లికి రూ.2 లక్షల కట్నం ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.