సీమంతం వేళ స్నేహితులతో గొడవ.. యువకుడి దారుణ హత్య

33చూసినవారు
సీమంతం వేళ స్నేహితులతో గొడవ.. యువకుడి దారుణ హత్య
AP: విశాఖపట్నంలో సీమంతం వేడుకలకు ముందు విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం తాటిచెట్లపాలెం సంజీవయ్యకాలనీలో బోరా మణికంఠ (26) అనే యువకుడు స్నేహితులతో జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షల నేపథ్యంలో సురేంద్ర అలియాస్ కన్నా అనే వ్యక్తి మణికంఠపై పిడిగుద్దులతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్