TG: మేడారం వనదేవతల దర్శనానికి వెళ్లిన రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన అలిమేఖల పురుషోత్తం, వికారాబాద్ జిల్లా చేవెళ్లకు చెందిన అరకటిక అరుణ్ కుటుంబాలు వనదేవతల మొక్కులు తీర్చుకున్నాక పక్కపక్కనే ఉన్న ప్రైవేట్ వసతుల్లో బస చేశాయి. ఈ క్రమంలో అరుణ్ కొడుకు (4) తండ్రి కారు కీ తీసుకుని కారును స్టార్ట్ చేశాడు. అకస్మాత్తుగా కారు ముందుకు కదలడంతో, అదే ఆవరణలో ఆడుకుంటున్న పురుషోత్తం కొడుకు, రెండో తరగతి చదువుతున్న కౌశిక్ (7)పైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో కౌశిక్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేశారు.