మేడారం జాతరలో మహాఘట్టం ఆరంభం

14327చూసినవారు
మేడారం జాతరలో మహాఘట్టం ఆరంభం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్న సమ్మక్క ఆగమన ప్రక్రియ మొదలైంది. గురువారం రాత్రి 8:30 గంటలకు గద్దెపైకి సమ్మక్క చేరుకోనున్నారు. జంపన్న వాగు మీదుగా మేడారం చేరుకున్న అమ్మవారికి భక్తులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్‌ కూడా పూజల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్