విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం.. జర్మనీ, స్విట్జర్లాండ్‌కు పయనమైన టీమ్

11447చూసినవారు
విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం..  జర్మనీ, స్విట్జర్లాండ్‌కు పయనమైన టీమ్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కీలక అడుగు వేసింది. విదేశీ విద్యా విధానాలు, నైపుణ్యాభివృద్ధి పద్ధతుల అధ్యయనానికి 35 మంది ఉన్నత స్థాయి బృందం ఆదివారం తెల్లవారుజామున జర్మనీ, స్విట్జర్లాండ్‌లకు బయలుదేరింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని ఈ బృందం జూన్ 28 నుంచి జులై 6 వరకు పర్యటించి, అక్కడి విద్యా సంస్థలు, పరిశ్రమలతో చర్చించి, విద్యార్థుల మార్పిడి, సిలబస్​లో మార్పులపై అధ్యయనం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ విజన్‌కు అనుగుణంగా ఈ పర్యటన విదేశీ వర్సిటీలతో విద్యా భాగస్వామ్యాన్ని పటిష్టం చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్