వందేళ్ల డాక్టర్‌.. ఫీజు రూ.50 మాత్రమే

509చూసినవారు
వందేళ్ల డాక్టర్‌..  ఫీజు రూ.50 మాత్రమే
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 100 ఏళ్ల వృద్ధ వైద్యుడు డాక్టర్ కాళీగోపాల్ ముఖర్జీ, కేవలం 50 రూపాయల ఫీజుతో రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. 1927 మే 5న జన్మించిన ఆయన, 1950లో వైద్య వృత్తిని ప్రారంభించి, 76 ఏళ్లుగా పేదల వైద్యుడిగా సేవలందిస్తున్నారు. క్యాన్సర్‌తో ఒక కన్ను కోల్పోయినా, వాకర్ సాయంతో నడుస్తున్నా, శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ ముఖర్జీ మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్