AP: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపట్లో భేటీ కానుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 17వ తేదీన, సర్పంచ్‌ల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఎన్నికల నిర్వహణ ప్రాథమిక కసరత్తుపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని మంగళవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో భేటీ కానున్నారు.