
శ్రీశైలంలో మహా అపచారం: వైసీపీ (వీడియో)
AP: శ్రీశైలంలో మహా అపచారం జరిగిందని వైసీపీ ఆరోపించింది. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘శ్రీశైలం దేవాలయంలోకి ఓ భక్తుడు ఫొన్ తీసుకెళ్లి.. గర్భగుడిలోని స్వామి వారి వీడియో తీశాడు. అసలు మొబైల్‌ను గుడి లోపలికి ఎలా అనుమతించారు. భక్తుడు వీడియో తీస్తుంటే భద్రతా సిబ్బంది నిద్రపోతున్నారా? శివ.. శివ.. శ్రీశైలంలో ఏంటి ఈ వరుస ఘోరాలు’ అని వైసీపీ పోస్టు చేసింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.




