లీగల్ వార్‌రూమ్ ఏర్పాటు చేయాలి: సజ్జల

23చూసినవారు
లీగల్ వార్‌రూమ్ ఏర్పాటు చేయాలి: సజ్జల
AP: వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి లీగల్‌ వార్‌రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో శనివారం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ లీగల్‌ సెల్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నామినేషన్‌ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అభ్యర్థులకు న్యాయపరమైన అండ అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్