చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే
అమెరికా తన అణు వ్యూహాన్ని మార్చాలని పెంటగాన్ యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.