పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలో జూన్ 13న జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు అత్తవారింటికి వెళ్లిన లవ్‌ప్రీత్ సింగ్‌పై బావమరిది సాజన్ సింగ్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. లవ్‌ప్రీత్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన గుర్జీత్ కౌర్ అనే మహిళ కూడా మంటల్లో చిక్కుకుంది. తీవ్ర గాయాలైన వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిందితుడు సాజన్ సింగ్ కూడా గాయపడటంతో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.