ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో బెహతాబజార్ గ్రామంలోని జగన్నాథ ఆలయం వర్షాలు, తుపానుల రాకను రెండు వారాల ముందే సూచిస్తుందని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. ఆలయంలోని గర్భగుడి చల్లబడటం, జగన్నాథ విగ్రహంపై చెమ్మ లేదా నీటి చుక్కలు కనిపించడాన్ని వర్ష సూచనగా భావిస్తారు. ఈ సూచనల ఆధారంగానే రైతులు నాట్లు వేసే సమయాన్ని నిర్ణయించుకుంటారు. పైకప్పు పూర్తిగా ఎండిపోతే వర్షం ఆగిపోయిందని నమ్ముతారు. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.