AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంస్థ చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో వైసీపీగ్రాఫ్ రాష్ట్రవ్యాప్తంగా పడిపోయినట్లు సమాచారం. పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఓటమి తర్వాత రాయలసీమలో పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది. అధినేత జగన్ బెంగళూరులో ఉండటంపై సొంత శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని సర్వే తేల్చింది.