ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో సినిమా ‘కొత్త మలుపు’ జూన్ 12న విడుదలైంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేమలో నమ్మకం, అనుమానం వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఆసక్తికరంగ
ా ఆవిష్కరించింది. హైదరాబాద్ కుర్రాడు కమల్ (ఆకాష్) పల్లెటూరి అమ్మాయి వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా)ని ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక యువతి అతడిని కాపాడటంతో వారి ప్రేమలో అనుమానాలు మొదలవుతాయి. నటీనటుల నటన, గోదావరి బ్యాక్‌డ్రాప్, సాంకేతిక నిపుణుల పనితనం సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.