ఏపీలో కొత్త తరహా మొబైల్ చోరీలపై కృష్ణా జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. షర్ట్ జేబులో మొబైల్ పెట్టుకునే వారినే లక్ష్యంగా చేసుకుని దొంగలు మోసాలకు పాల్పడుతున్నట్లు హెచ్చరించారు. ఓ దొంగ బైక్‌పై వెళ్తూ కిందపడిపోయినట్లు నటించగా, అతడికి సహాయం చేసేందుకు బాధితుడు వెళ్లే సమయంలో వెనుక నుంచి వచ్చే మరో వ్యక్తి షర్ట్ జేబులోని మొబైల్‌ను చాకచక్యంగా అపహరిస్తాడు. అపరిచితులకు సహాయం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.