AP: బాపట్ల పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీలో
టీడీపీ నాయకుడి ముఖ్య అనుచరుడికి పదవి కేటాయించడంపై
జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు మండల కన్వీనర్ ప్రధాన అనుచరుడిగా,
టీడీపీ సభ్యుడిగా ఉన్న ఈమని మణికంఠకు జనసేనలో సాదక్ రిప్రజెంటేటివ్‌గా పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
టీడీపీ మండల కన్వీనర్ సిఫారసే దీనికి కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో
జనసేన కార్యకర్తగా ఉన్న మణికంఠ, కొన్నేళ్లుగా
టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణకు ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తూ, ఆ పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు.