AP: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి 25 రోజుల క్రితం అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు 12 బృందాలతో గాలిస్తున్నా ఆమె ఆచూకీ లభించలేదు. చిన్నారి చిత్రంతో గోడపత్రికలు అతికించి, సమాచారం తెలిపిన వారికి రూ.లక్ష పారితోషికం ప్రకటించారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. 9440796508, 9440796531, 9440796573 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.