భూగర్భంలో అద్భుత ప్రపంచం.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ!

7124చూసినవారు
భూగర్భంలో అద్భుత ప్రపంచం.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ!
భూమి ఉపరితలం కింద కంటికి కనిపించని, గ్రహం మనుగడకు అత్యంత కీలకమైన ఒక అద్భుత ప్రపంచాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగర్భంలో విస్తరించి ఉన్న ఈ సూక్ష్మ శిలీంధ్రాల వ్యవస్థ (ఫంగల్ నెట్‌వర్క్) మొత్తం పొడవు సుమారు 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్లు ఉంటుందని అంచనా. 'ఆర్బస్కులర్ మైకోరైజల్' గా పిలిచే ఈ శిలీంధ్రాలు మొక్కలతో సహజీవన సంబంధాన్ని కొనసాగిస్తూ, నీరు, పోషకాలను అందిస్తాయి. దీనిని 'వుడ్ వైడ్ వెబ్' అని కూడా వ్యవహరిస్తారు. 'సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్స్' నేతృత్వంలోని పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 16,000కు పైగా మట్టి నమూనాలను విశ్లేషించి, ఈ సమగ్ర మ్యాప్‌ను తొలిసారిగా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్