ప్రేమించిన యువతి కోసం.. సరిహద్దు దాటిన యువకుడు

11935చూసినవారు
ప్రేమించిన యువతి కోసం.. సరిహద్దు దాటిన యువకుడు
ప్రేమించిన యువతిని కలవాలని, తన పూర్వీకుల భూమిని తిరిగి పొందాలనే ఉద్దేశంతో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK)కు చెందిన 22 ఏళ్ల జీషాన్ మీర్‌ను భారత సైన్యం శనివారం పాకిస్థాన్‌కు అప్పగించింది. ఈ ఏడాది మే 31న ఉరీ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ (LoC) దాటుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన ఇరమ్ బానోతో స్నాప్‌చాట్‌లో పరిచయం ప్రేమగా మారడంతో, ఆమెను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడాలని జీషాన్ భావించాడు. ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని నిర్ధారించుకున్నాక, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి అతన్ని పాకిస్థాన్‌కు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్