AP: రీల్స్ పిచ్చి మరో యువకుడి ప్రాణం తీసింది. కడప జిల్లా కేంద్రంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరిస్తూ బైక్‌పై నుంచి పడిపోవడంతో ముబారక్ (20) అనే యువకుడు మృతి చెందాడు. ఎక్కువ వ్యూస్ వస్తాయనే ఆశతో బైక్‌తో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముబారక్‌తో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.