AP: విశాఖపట్నంలో రాష్ట్రపతి కాన్వాయ్ సమీపంలోకి ఒక యువకుడు దూసుకురావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కాన్వాయ్ వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కాన్వాయ్‌ను ముందుకు పంపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.